HYD: మనిషివా..మోహన్ బాబువా..సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆగ్రహం

మీడియాపై దాడి చేయడమే కాక జర్నలిస్టులను మైక్‌తో కొట్టిన మోహన్ బాబు మీద మండిపడ్డారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ వ్యవస్థాపకులు రవిప్రకాష్. ఇది అహంకారమే కాదు సిగ్గుచేటు కూడా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

New Update
manoj  (1)

జర్నలిస్ట్‌ల మీద నటుడు మోహన్ బాబు దాడి చేయడం వివాదాస్పదం అయింది. దీనిపై మీడియా ప్రతినిధులు నిరసన తెలియజేస్తున్నారు. మోహన్ బాబు తమకు సారీ చెప్పాలంటూ జర్నలిస్టులు ఆందోళన చేశారు. హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు నివాసం గేట్లను మనోజ్ తోసుకుంటూ లోపలికి వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో అక్కడి విషయాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి చేతుల్లోని మైకులను లాక్కొని ఆవేశంతో ఊగిపోయారు. ఆ మైక్‌లతో మీడియా ప్రతినిధులపైనే దాడి చేశారు. ఆపై ఆ మైకులను నేలకేసి కొట్టారు. ఈ దాడిలో ఓ కెమెరామెన్‌ కిందపడ్డారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు మోహన్ బాబును అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

సిగ్గుచేటు..

దీనిపై సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ వ్యవస్థాపకులు రవిప్రకాష్ స్పందించారు. మోహన్ బాబు అధ:పాతాళానికి దిగజారిపోయారు అంటూ కామెంట్ చేశారు. మీడియా పై దాడి చేయడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అహంకారమే కాదు సిగ్గుచేటు కూడా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  ఇలాంటి బిహేవియర్‌‌ను ఎవరూ సహించరంటూ మండిపడ్డారు రవి ప్రకాష్. 

 

Also Read: 11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే?

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు