సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ను మధ్యాహ్నం 2 గంటలకు డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ పరామర్శించనున్నారు. అనంతరం ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తో వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని సీఎం రేవంత్ ప్రకటించడంతో టాలీవుడ్ కు బిగ్ షాక్ తగిలినట్లైంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తో పాటు ప్రభుత్వంతోనూ దిల్ రాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఆయన సయోధ్య కుదిర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: పిచ్చి పిచ్చి వేశాలొద్దు.. పుష్ప ఫ్యాన్స్ కు సీపీ సీరియస్ వార్నింగ్! దిల్ రాజు సూచనలతోనే.. దిల్ రాజు సూచనతోనే రెండ్రోజుల క్రితం పుష్ప నిర్మాతలను రెండ్రోజుల క్రితం కిమ్స్ కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. రూ.50 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించారు. నిన్న దిల్ రాజు కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ రోజు సుకుమార్, అల్లు అరవింద్ ను తీసుకుని ఆస్పత్రికి వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి శ్రీతేజ్ ను పరామర్శించడానికి ఇంత వరకు ఎవరూ రాలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ ను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Dil Raju: శ్రీతేజ్ తండ్రికి జాబ్.. నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన! రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తామన్నారు..సినీ ఇండస్ట్రీ నుండి అందరం వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము -ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు.. pic.twitter.com/697Faq3nbB — Kaza Vk Ramabrahmam (@KazaVk) December 24, 2024 వివాదం ముగించడానికి మరో రెండు మూడు రోజుల్లో అల్లు ఫ్యామిలీ పెద్దలను సీఎం రేవంత్ తో కలిపేందుకు దిల్ రాజ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈ రోజే రేవంత్ ను కలిసి మాట్లాడాలని దిల్ రాజు భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కానీ, సీఎం మెదక్ టూర్ నేపథ్యంలో దిల్ రాజు భేటీ కుదరలేదని తెలుస్తోంది. దీంతో రేపు లేదా ఎల్లుండి దిల్ రాజు సీఎంను కలిసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం సినీ పెద్దలు, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులను సీఎం వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.