BREAKING: స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత!

రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఓ ఫార్మ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఫార్మ్ హౌజ్ పై దాడి చేసిన  పోలీసులు పార్టీలో భారీగా ఫారెన్ మద్యం, డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న పలువురికి టెస్టులు నిర్వహించగా డ్రగ్స్  పాజిటివ్ అని తేలింది. 

New Update
 drugs

drugs

BREAKING:  హైదరాబా శివారు ప్రాంతంలో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ బకారంలోని ఫార్మ్ హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టు బడ్డాయి.పార్టీలో మాదకద్రవ్యాలు వాడుతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు ఫార్మ్ హౌస్ పై దాడులు చేశారు . దీంతో డ్రగ్స్ గుట్టు రట్టయింది.

51 మందిని అదుపులోకి

ఈ దాడిలో పోలీసులు మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలామందిని నైజీరియా, ఉగాండా దేశాలకు చెందినవారిగా గుర్తించారు. అంతే కాదు వీరంతా కూడా విదేశీ డ్రగ్ పెడ్లర్లు అని పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టయిన వారిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.

ఇందులో ఇప్పటికే కొంతమందికి డ్రగ్ టెస్ట్‌లు చేయగా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. పార్టీలో పెద్ద మొత్తంలో ఫారిన్ మందు, డ్రగ్స్ స్వాదీనం చేసుకున్నారు. 65 బీర్ బాటిళ్లు, 20 లీటర్ల మద్యాన్ని పట్టుకెళ్లారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండానే మందు పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు.

అయితే ఉగాండాకు చెందిన మమస్ అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అరెస్ట్ అయిన వారిలో 12 మందికి పైగా విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది మాత్రమే కాదు అరెస్ట్ అయిన విదేశీయుల పాస్‌పోర్ట్‌లు, వీసాలను పోలీసులు పరిశీలించగా.. అందులో కొంతమంది వీసా గడువు ముగిసినా భారత్‌లో అక్రమంగా ఉంటున్నారని తేలింది. దీంతో అక్రమంగా ఇండియాలో ఉంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలుసులు తెలిపారు.  

Also Read: పండగపూట ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ప్రైవేట్ బస్సుల్లో 18 మంది

Advertisment
తాజా కథనాలు