/rtv/media/media_files/2025/05/17/Xsu5f2vbr8PM7qFP19mX.jpg)
AIMIM Chief Asaduddin Owaisi
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శక్రవారం (ఈరోజు) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నవీన్ యాదవ్‌తోపాటు ర్యాలీలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో AIMIM కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆయన్ని కలిశారు. అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
“Das saal poore barbaad ho gaye.”
— Telangana365 (@Telangana365) October 17, 2025
గడిచిన పదేళ్లు జూబ్లీహిల్స్ అంతగా అభివృద్ధికి నోచుకోలేదు
నువ్వే చేయాలి ఈ సారి.
- అసదుద్దీన్ ఒవైసీ pic.twitter.com/vnCWs75w1u
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3.9 లక్షల మంది ఓటర్ల సెంటిమెంట్, కేవలం ఒక్క అభ్యర్థి సెంటిమెంట్ కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు MIM మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. BRS 10 సంవత్సరాలలో పూర్తిగా విఫలమైంది. వారు 10 సంవత్సరాలు వృధా చేశారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కానీ జూబ్లీహిల్స్‌లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు-. AIMIM జూబ్లీహిల్స్‌లో పోటీ చేయదు. అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు 37% ఓట్ల వాటా వచ్చిందని, 5 నెలల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వాటా 15% కి పడిపోయిందని TG ఓటర్లు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. BRS ఓటు BJPకి పోయింది. తెలంగాణలో BJP వృద్ధిని ఆపాలని MIM పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. BRS మాగంటి గోపీనాథ్‌కు టికెట్ ఇవ్వకపోతే ఈ ఎన్నికలు జరిగేవి కావు. 2023లోనే ఆయన అనారోగ్యంతో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు బాగా తెలుసని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.