BIG BREAKING : పిస్తా హౌస్ , షాగౌజ్ హోటల్లో ఐటీ దాడులు... ఏకంగా 50మందితో

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ వ్యాపారవేత్తలు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారుల లక్ష్యంగా మారారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ముఖ్య కేంద్రాల్లో ఐటీ దాడులు విస్తృతంగా కొనసాగుతున్నాయి.

New Update
pista house

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ వ్యాపారవేత్తలు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారుల లక్ష్యంగా మారారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ముఖ్య కేంద్రాల్లో ఐటీ దాడులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి, నగరంలో అత్యంత పేరుగాంచిన ఆహార సంస్థలైన పిస్తా హౌస్, షా గౌజ్ హోటల్ యజమానుల ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు జరుగుతున్నాయి.

దాదాపు 50కి పైగా టీమ్స్‌ను

ఈ దాడుల కోసం ఐటీ శాఖ దాదాపు 50కి పైగా టీమ్స్‌ను రంగంలోకి దించింది. ఈ బృందాలు హోటల్ యజమానుల నివాసాలు, ప్రధాన కార్యాలయాలు, వ్యాపార సంస్థలతో సహా అనేక ముఖ్య ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, భారీ నగదు లావాదేవీలపై దృష్టి సారించిన అధికారులు, కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు మరియు లాకర్ల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సోదాల పూర్తి వివరాలు వెల్లడి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు