Amrapali: ఆమ్రపాలి ఔట్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి

ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇలంబర్తి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యుత్ శాఖ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియాను కేటాయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) డీఓపీటీ  ఐఏఎస్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని.. తమను రిలీవ్ చేయకుండా ఉండాలని కోరుతూ క్యాట్, హైకోర్టులను ఆశ్రయించిన ఐఏఎస్‌ అధికారులకు ఊరట దక్కలేదు. దీంతో ఏపీకి వెళ్లాల్సిన వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్ తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు. 

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఐఏఎస్ అధికారులపై కసరత్తులు చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యుత్ శాఖ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియాకు, ఆరోగ్య శ్రీ, హెల్త్‌ కేర్‌కు ఆర్వీ కర్ణన్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే టూరిజం శాఖ సెక్రటరీగా ఎన్‌.శ్రీధర్‌ బాబును కేటాయించింది.  

GHMC

Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

 ఇప్పటికే ఏపీ నుంచి తెలంగాణకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు వచ్చారు. హైకోర్టు తీర్పుతో ఏపీకి ఆమ్రపాలితో సహా రొనాల్డ్‌ రాస్‌, వాణి ప్రసాద్‌, వాకాటి కరుణ వెళ్లనున్నారు. ఇక ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి రిపోర్టు చేశారు.

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలన్న క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్లకు హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి తమను ఏపీకి పంపించొద్దని వేడుకున్నా ఊరట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్నా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ముందు వెళ్లి ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రజా సేవ కోసం ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడకు వెళ్లి పని చేయాల్సిందే అని స్పష్టం చేసింది.

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

Advertisment
తాజా కథనాలు