BIG BREAKING : నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి!

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 21 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడుతూ, భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.

New Update
nampally

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 21 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడుతూ, భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.  మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. మృతులను ప్రణీత్‌, బేబీ, ఇంతియాజ్‌, అఖిల్‌, హబీబ్‌గా గుర్తించారు.

200 మంది రెస్క్యూ సిబ్బంది

మంటలు చెలరేగిన క్షణం నుండి దాదాపు 21 గంటల పాటు ఆ భవనం అగ్నిగుండంలా మారింది. లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. భవనం లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో, సుమారు 200 మంది రెస్క్యూ సిబ్బంది రాత్రంతా నిర్విరామంగా శ్రమించారు. చివరికి సెల్లార్‌లో ఒక గుంత తవ్వి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడ విగతజీవులుగా పడి ఉన్న ఐదుగురిని గుర్తించారు.

ఫర్నీచర్ షాపులోని కెమికల్స్, కలప కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, వారు తప్పించుకునే అవకాశం లేక సెల్లార్‌లోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని అధికారులు భావిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 21 గంటల పాటు తమ వారు బతికి వస్తారని ఆశగా ఎదురుచూసిన వారందరికీ ఈ పరిణామం తీరని శోకాన్ని మిగిల్చింది.

Advertisment
తాజా కథనాలు