Hyderabad Metro Charges: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.  పెంచిన మెట్రో రైలు ఛార్జీలు సవరించింది. ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.  మే 24 నుంచి తగ్గిన మెట్రో ఛార్జీలు వర్తించనున్నాయి.

author-image
By Krishna
New Update
Hyderabad metro

Hyderabad metro

Hyderabad Metro Charges: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.  పెంచిన మెట్రో రైలు ఛార్జీలను సవరించింది. ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం మంగళవారం నిర్ణయం తీసుకుంది.  మే 24 నుంచి తగ్గిన మెట్రో ఛార్జీలు వర్తించనున్నాయి.  ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.  కాగా ఇటీవల కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ప్రకటించింది.   ఆ పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కసారిగా 20 నుంచి 25 శాతం టికెట్ ధరలు పెరగడంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి.  

 

ఇటీవ‌ల పెరిగిన మెట్రో ఛార్జీలు ఇలా..

మొద‌టి 2 కి.మీ. వ‌ర‌కు రూ. 12
2 నుంచి 4 కి.మీ. వ‌ర‌కు రూ. 18
4 నుంచి 6 కి.మీ. వ‌ర‌కు రూ. 30
6 నుంచి 9 కి.మీ. వ‌ర‌కు రూ. 40
9 నుంచి 12 కి.మీ. వ‌ర‌కు రూ. 50
12 నుంచి 15 కి.మీ. వ‌ర‌కు రూ. 55
15 నుంచి 18 కి.మీ. వ‌ర‌కు రూ. 60
18 నుంచి 21 కి.మీ. వ‌ర‌కు రూ. 66
21 నుంచి 24 కి.మీ. వ‌ర‌కు రూ. 70
24 కి.మీ. నుంచి ఆపై దూరానికి రూ. 75

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు