Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్‌…ఆ రూట్లో పరుగులు!

తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్‌ ఎక్స్ ప్రెస్‌ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్‌ -నాగ్‌పూర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ ట్రైన్‌ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్‌ రైలును వర్చువల్‌ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్‌ రైళ్లు సేవలందిస్తుండగా…ఐదో రైలు ఈ నెల 15 నుంచి పరుగులు పెట్టబోతోందన్నారు. ఈ ఎక్స్ప్రెస్‌ రైలు రెండు నగరాల మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్‌ -నాగ్‌పూర్‌ స్టేషన్ల మధ్య మరో వందేభారత్‌ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్‌ రైలును వర్చువల్‌ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు.

author-image
By Bhavana
VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే!
New Update

Vande Bharat :

తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్‌ ఎక్స్ ప్రెస్‌ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్‌ -నాగ్‌పూర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ ట్రైన్‌ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్‌ రైలును వర్చువల్‌ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. 

ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్‌ రైళ్లు సేవలందిస్తుండగా…ఐదో రైలు ఈ నెల 15 నుంచి పరుగులు పెట్టబోతోందన్నారు. ఈ ఎక్స్ ప్రెస్‌ రైలు రెండు నగరాల మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.

అధికారుల షెడ్యూల్‌ ప్రకారం..ఈ రైలు నాగ్‌పూర్‌ లో ఉదయం 5 గంటలకు బయల్దేరి…మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌ కు చేరుకోనుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్‌ లో బయల్దేరి..రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

#secunderabad #kishan-reddy #nagpur #vande-bharat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe