Ponguleti: పొంగులేటి ఇంట్లో నోట్ల గుట్టలు.. మూడు మిషన్లతో లెక్కింపు!

తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మూడు కౌంటింగ్ మిషన్లను లోపలికి తీసుకెళ్లడంతో.. లోపల భారీ నగదు దొరికిందన్న ప్రచారం సాగుతోంది.

New Update

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. ఉదయం 6 గంటలకు మొదలైన సోదాలు.. ఇంకా కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 11 గంటల నుంచి అధికారుల తనిఖీలు నాన్ స్టాప్ గా జరుగుతుండంతో లోపల ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. ఉదయం 2 కౌంటింగ్ మిషన్లను తీసుకెళ్లిన అధికారులు.. ఇప్పుడు మరొకటి తీసుకెళ్లారు. మూడు మిషన్లతో లెక్కిస్తున్నారంటే లోపల భారీగా నగదును గుర్తించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తం ఏడుగురు అధికారులు..

మొత్తం ఏడుగురు ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీడియో రికార్డింగ్‌ చేస్తూ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఇంటికెళ్లిన బంధువులను సైతం మళ్లీ బయటకు రానివ్వడం లేదు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి వియ్యంకుడు, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి సైతం పొంగులేటి నివాసంలోనే ఉన్నారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, పొంగులేటికి చెందిన రాఘవా కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా.. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై సైతం ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.

Also Read :  లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టుకు షర్మిల... సంచలన లేఖ!

Advertisment
Advertisment
తాజా కథనాలు