BIG BREAKING : నిమ్స్‌ డిప్యూటి సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదు!

నిమ్స్‌ డిప్యూటి సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదైంది. స్థలం ఇప్పిస్తానంటూ రాజమండ్రి కి చెందిన మరో వైద్యుని దగ్గర రూ.50 లక్షలు కాజేసినట్లుగా లక్ష్మీ భాస్కర్ పై ఆరోపణలున్నాయి.

New Update
nims

నిమ్స్‌ డిప్యూటి సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదైంది. స్థలం ఇప్పిస్తానంటూ రాజమండ్రి కి చెందిన మరో వైద్యుని దగ్గర రూ.50 లక్షలు కాజేసినట్లుగా లక్ష్మీ భాస్కర్ పై ఆరోపణలున్నాయి.  ఈ ఘటనపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఏప్రిల్ లోనే బంజారాహిల్స్ పోలీసులకు లక్ష్మీ భాస్కర్ పై ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. తాజాగా కోర్టు సిఫారసుతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు  గతంలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లుగా లక్ష్మీ భాస్కర్ పై ఆరోపణలు రాగా ఇప్పటికే అతనిపై మూడు పోలీస్ స్టేషన్ లలో  కేసులు నమోదయ్యాయి. తనకి గత ప్రభుత్వ రాజకీయ నేతల పలుకుబడి ఉందని బాధితుడని బెదిరింపులకు లక్ష్మీ భాస్కర్ గురిచేసినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీ భాస్కర్ కు సహకరించిన మరికొందరి పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  

Advertisment
తాజా కథనాలు