Mallareddy: ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్ కొడుకు హీరోగా నటిస్తూ సినిమా తీశాడు. ఆ మూవీ ప్రమోషన్ ఈమెంట్‌లో హీరోయిన్ కసికాపూర్.. కసికసిగా ఉందని మల్లారెడ్డి అన్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మల్లారెడ్డి కామెంట్లపై పలువురు విమర్శిస్తున్నారు.

New Update
mallareddy hot comments

mallareddy hot comments Photograph: (mallareddy hot comments)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. ఆయన మాటలు, చేష్ఠలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. తాజాగా ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన హీరోయిన్‌పై చేసిన కామెంట్లకు విమర్శలు వస్తున్నాయి. మల్లారెడ్డి కాలేజ్‌లో పని చేసే ప్రిన్సిపల్ కొడుకు హీరోగా ఓ చిత్రం తెరకొక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మల్లారెడ్డి కాలేజ్‌లో  శుక్రవారం ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి నోరు జారారు. వేదిక మీద ఉన్న హీరోయిన్ కసికాపూర్ గురించి పరిచయం చేస్తూ.. హీరోయిన్ మంచి కసికసిగా ఉందని అన్నారు.

Also read:GST Notices: రోజుకు రూ.500 సంపాదించేవారికి.. రూ.6 కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసులు

Also read: BIG BREAKING: ఇండియా పక్కనే మరో అతి భయంకరమైన భూకంపం!

అలాగే అసెంబ్లీ కూడా వెళ్లకుండా ఈ కార్యక్రమానికి వచ్చానని మల్లారెడ్డి అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లారెడ్డి హీరోయిన్‌పై చేసిన కామెంట్స్, అలాగే అసెంబ్లీకి డుమ్మా కొట్టి మూవీ ప్రమోషన్ ఈమెంట్‌ వచ్చా అన్న వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు ఆయన మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. గతకొన్ని రోజుల క్రితమే మల్లారెడ్డి రాబిన్‌హుడ్ సినిమో ప్రి రిలీస్ ఈవెంట్‌లో హీరో నితిన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఇక ఆ మూవీ ఈవెంట్ కూడా మల్లారెడ్డి కాలేజ్‌లోనే జరిగింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు