ఓర్నీ.. నవ వధువుతో బీజేపీ నేత పరార్ !

నవ వధువుతో బీజేపీ నేత పరార్ అయిన ఘటన  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్ (46) కు ఇప్పటికే పెళ్లి అయింది.

New Update
bjp leader na vadhuvu

నవ వధువుతో బీజేపీ నేత పరార్ అయిన ఘటన  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురుజాల అరవింద్ (46) కు ఇప్పటికే పెళ్లి అయింది. అతనికి ఓ పాప కూడా ఉంది. అయితే తాజాగా పెళ్లైన ఓ నవ వధువుతో అరవింద్ పరారయ్యాడు. లంగర్ హౌస్ గొల్లబస్తీలో ఉండే యువతికి అరవింద్ తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది.  

అరవింద్ ఫొటోకు చెప్పుల దండ

అయితే15 రోజుల కింద ఆ యువతికి అత్తాపూర్ కు చెందిన మరో యువకుడితో వివాహమైంది. ఈ క్రమంలో మూడురోజుల కింద అరవింద్ బండ్లగూడ సమీపంలోని ఆర మైసమ్మ ఆలయం వద్దకు ఆ యువతిని పిలిపించి అక్కడినుంచి ఆమెను తీసుకుని పారిపోయాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సోమవారం లంగర్ హౌస్ లో అరవింద్ ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన చేపట్టారు.  స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.  

Also read :  పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు.. రచ్చలేపిన గ్యాంగ్ వార్- వీడియో చూశారా?

Advertisment
తాజా కథనాలు