ఓరెయ్ ఎంట్రా ఇది..ఆటోలో రోమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన డ్రైవర్!-VIDEO VIRAL

హైదరాబాద్ లో యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్ లో ఏం చేస్తున్నామో కనీసం సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ రోడ్డుపైనే రెచ్చిపోయాడు.  ఓ యువతితో తన ఆటోలోనే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయాడు.

New Update
auto driver

హైదరాబాద్ లో యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్ లో ఏం చేస్తున్నామో కనీసం సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ రోడ్డుపైనే రెచ్చిపోయాడు.  ఓ యువతితో తన ఆటోలోనే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి కోఠి రూట్‌లో పబ్లి్క్‌ ముందే  ఇదంతా జరిగింది. ఓ యువతితో ప్లే అవుతున్న పాటకు రొమాన్స్ చేస్తూ ఆటో నడిపాడు. ఇదంతా రోడ్డుపై చూస్తున్న వాహనదారులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు

దీనిని రికార్డు చేసి సోషల్ మీడియాలోకి ఎక్కించడంతో ఇప్పుడా ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది కాస్త  పోలీసుల దృష్టికి వెళ్లడంతో  ఆటో నెంబర్ ఆధారంగా డ్రైవర్‌పై చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలింపులు చేపట్టారు. పోలీసులు ఇలాంటి వారికి సరైన గుణపాఠం నేర్పాలని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. రోడ్డు మీద ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి పనికిమాలిన పనులు చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగితా రాష్ట్రాల్లో కూడా ఇలాగే ప్రేమజంటలు బరితెగించిన ఘటనలు చాలానే ఉన్నాయి.  

Advertisment
తాజా కథనాలు