/rtv/media/media_files/2025/11/11/hyderabad-police-2025-11-11-16-02-51.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంగించిన పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులను నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్‌పై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు ఫైల్ అయ్యాయి. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.
ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియామవళిని గౌరవించాలని సూచిస్తున్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Follow Us