Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి అరుదైన స్థానం సంపాదించుకుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో భాగ్యనగరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ‘ఇండియా ప్రైమ్‌సిటీ ఇండెక్స్’ నివేదిక ప్రకారం.. దేశంలోని 6 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మొదటి ప్లేస్ లో ఉంది. దేశ సత్వర ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. మౌలిక సదుపాయాలు, స్థిరాస్తి రంగం విస్తరణ, ప్రభుత్వ విధానాలు- పరిపాలన, జనాభా పెరుగుదల వంటి విస్తరిస్తున్న తీరును ఈ నివేదికలో వెల్లడించినట్లు ఆయన వెల్లడించారు. ఇక హైదరాబాద్ తర్వాత బెంగళూరు 2, ముంబయి 3, ఢిల్లీ 4, అహ్మదాబాద్ 5, చెన్నై 6 స్థానానల్లో నిలిచి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
వార్షిక వృద్ధి:
గడిచిన పదేళ్లలో హైదరాబాద్ స్థిరాస్తి రంగం 10% వార్షిక వృద్ధి చెందింది. గతేడాది 2023లో 11% వృద్ధి నమోదైనట్లు గులామ్ తెలిపారు. రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో పెట్టుబడిదారులు, వినియోగదార్లు భూములు కొనడం లేదా లీజుకు తీసుకోవడంపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించింది.
ఇది కూడా చదవండి: జనవరిలో దావోస్‌కు సీఎం చంద్రబాబు
కమర్షియల్ రియల్ ఎస్టేట్..
ఇక కమర్షియల్ రియల్ ఎస్టేట్ పరంగా బెంగళూరు దూసుకుపోతున్నట్లు నివేదికలో వెల్లడించారు. విదేశీ పెట్టుబడులను బెంగళూరు బాగా ఆకర్షిస్తోంది. దీంతో స్థిరాస్తి రంగం బెంగళూరు అభివృద్ధికి చోదక శక్తిగా మారింది. బెంగళూరులో దేశ, విదేశీ సంస్థలెన్నో కార్యకలాపాలు సాగిస్తున్నందువల్ల నిరుద్యోగం తక్కువగా ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి: AIIMS: జవాన్‌కి పునర్జన్మ.. 90 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టుకున్న గుండె