/rtv/media/media_files/2025/02/01/keJGkYkJW60q7cBGpgXg.jpg)
Firing on police at Prism Pub in Gachibowli, Hyderabad
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ రెండు రౌండ్లు కాల్పులు జరిపడంతో కానిస్టేబుల్‌తో పాటు ఒక బౌన్సర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read :వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?
పోలీసులపై కాల్పులు
గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో శనివారం రాత్రి దొంగను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలోనే అతడు పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తొడభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అలాగే కానిస్టేబుల్‌తో పాటు పబ్‌లో ఉన్న ఒక బౌన్సర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల అదుపులో దొంగ
అయితే దొంగ కాల్పులు జరిపినప్పటికీ పోలీసులు సాహసం చేసి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ కాల్పుల ఘటన గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక దొంగను పట్టుకున్న పోలీసులు.. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌గా చెబుతున్నారు.
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
దీంతో అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయి?.. అతడు ఎంత కాలం నుంచి పరారీలో ఉన్నాడు.. అసలు కాల్పులు జరపడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడికి గన్ ఎక్కడ నుంచి వచ్చింది? అనే మరికొన్ని అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనతో పబ్‌లోపల, బయట గందరగోళం వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.