జూబ్లీహిల్స్ ప్రజలకు CP సజ్జనార్ హెచ్చరిక.. ఈ టైంలో ఆంక్షలు

హైదరాబాద్ CP సజ్జనార్ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌ సమయంలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు కూడా వైన్ షాపులు మూసేయాలన్నారు.

New Update
Sajjanar Hyderabad CP

హైదరాబాద్ సీపీ సజ్జనార్ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్‌ జరగనున్న 11వ తేదీ (మంగళవాం) సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. 

ఆయా టైంలో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు