Nalgonda Crime: నల్లగొండ జిల్లాలో భార్యను సాగర్‌లో భర్త తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తాను కూడా కాల్వలో దూకి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తన భార్య కొట్టుకెళ్లిపోయి చనిపోయిందని భర్త పోలీసులకు చెప్పాడు. భర్త చెప్పే దానిపై పోలీసులకు అనుమానం రావడంతో.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.
అనుమానంతో చంపాడు..
పోలీసుల విచారణలో అసలు నిజం చెప్పాడు భర్త. మిర్యాలగూడ వేములపల్లి రావువారిగూడానికి చెందిన సైదులు, అనూషకు 16 ఏళ్ల కిందట కులాంతర వివాహం జరిగింది. అంగన్‌వాడీ టీచర్‌గా అనూష పని చేస్తోంది. భార్యపై సైదులు అనుమానం పెంచుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి భార్యను తీసుకొస్తూ హత్య చేశాడు. సాగర్ ఎడమ కాల్వ దగ్గర భార్యతో గొడవ పడ్డాడు. కాల్వలో తోసేయడంతో భార్య అనూష కొట్టుకుపోయింది.
Also Read : కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు..