చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ నెలకొంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇళ్లు తమకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. By B Aravind 30 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ నెలకొంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇళ్లు తమకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉంటున్న మమ్మల్ని కాకుండా.. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా కేటాయిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. Also Read: వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్.. మూసీ కూల్చివేతలపై కొత్త ప్లాన్ ఇదే! ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లోని బఫర్‌జోన్‌లో ఉంటున్న వారి ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులు ఇళ్లు కోల్పోవడంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లల్లోకి బాధితులను పంపిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే చంచల్‌గూడలో స్థానికులు ఆందోళన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. #hyderabad #hydra #ranganath #chanchalguda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి