/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
Telangana High Court : గ్రూప్ 1 కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ను రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. లాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ పలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. ఒక వేళ మూల్యంకనం సాధ్యం కాకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం టీజీపీఎస్సీని ఆదేశించింది.మ్యూలంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు పరీక్షలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గ్రూపు 1 మెయిన్స్ మెరిట్ లిస్టును కోర్టు రద్దు చేసింది. తిరిగి మెయిన్స్ పరీక్షుల నిర్వహించాలని టీజీపీఎస్‌సీని ఆదేశించింది.
జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే, కాగా ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును రద్దు చేయాలని తీర్పును వెలువరించింది.
గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇలా అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు తీర్పును ఇచ్చింది.గ్రూపు 1 నిర్వహణలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కొందరు తమ వాదన వినిపించగా, రద్దు చేయవద్దంటూ మరికొందరు వేసిన పిటిషన్లపై జులై 7న వాదనలు జరిగాయి. వారి వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కానీ, హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ రోజు తీర్పుతో అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.
వరుసగా రద్దులు...
గ్రూపు 1 నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ఇబ్బందితో రద్దవుతూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్ కు సిద్ధం అవుతున్న సమయంలో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ విషయం బయటపడడంతో ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాల్సివచ్చింది.
ఆ తర్వాత జూన్ 11న రెండోసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గాను 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ ని కూడా విడుదల చేశారు. ఈ పరీక్ష రాసిన విద్యార్థులంతా మెయిన్స్కు సిద్దమవుతున్నారు. కానీ ఈ పరీక్ష కూడా రద్దయింది. దీనికి కారణం ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోవడం. దీంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు..గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. మరోసారి నిర్వహించాలని సూచించింది.
తిరిగి 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు మొత్తం 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10, 2025న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్‌జరిపారని కోర్టులో ఫిటిషన్ వేశారు. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మరోసారి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read : అల్లు కనకరత్నమ్మ దశదినకర్మ.. పవన్, కేటీఆర్ సహా ప్రముఖుల నివాళులు