Telangana: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్‌లోని చెరువు ఎఫ్‌టీఎల్‌ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో 65 ఎకరాలుగా మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ హైకోర్టులో దీనిపై చేపట్టిన విచారణ సోమవారానికి వాయిదా పడింది.

High Court
New Update

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ ఆరాధే ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం విచారణను చేపట్టింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్) 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గత రికార్డుల ప్రకారం చూసుకుంటే ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కేవలం 65 ఎకరాలుగా మాత్రమే ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే పిటిషన్‌పై విచారణను హైకోర్టు మళ్లీ సోమవారానికి వాయిదా వేసింది. 

Also Read: అదృశ్యమైన ముగ్గురు గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం

ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, నీటిపారుదల శాఖలతో పాటు హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఇదిలాఉండగా ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న వివిధ చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఇంకా హైడ్రా చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.  

#telugu-news #high-court #durgam-cheruvu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe