Telangana: బంగాళాఖాతంలో సాగుతున్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో నేడు ఏర్పడే అల్పపీడన ప్రభావం వల్ల నేటి నుంచి 26 వరకు దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా, కర్నూలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ శనివారం హెచ్చరికలు జారీ చేసింది. భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. మరోవైపు శనివారం రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు చాలా ఇబ్బంది పడ్డారు.
Also Read : లడ్డూ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం.. నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్!