కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. శనివారం ఈ కమిషన్ బహిరంగా విచారణ జరిగింది. ఈ విచారణకు సీఈ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేసింది. ఎలాంటి తనిఖీలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీకి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు సుధాకర్ రెడ్డి అంగీకరించారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (DPR) ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Also Read: ముక్కు నేలకు రాపిస్తా.. ఎవ్వరినీ వదిలి పెట్టా.. జగ్గారెడ్డి కామెంట్స్
మూడుసార్లు హరీష్‌రావు పేరు ప్రస్తావన
మేడిగడ్డ డిజైన్‌ను ఖరారు చేసే సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు తెలిపారు. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు అని కమిషన్ అడగగా.. హరీశ్‌రావు అని సుధాకర్ సమాధానం ఇచ్చారు. హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ల విధానం జరిగిందా అని కమిషన్ ప్రశ్నించింది. అయితే టెండరింగ్ ప్రాసెస్ జరగలేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు.
బిల్లులు ఎందుకు ఆలస్యం
హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో జరిగిన టెస్టుల రికార్డులను వ్యాప్కొస్ సంస్థకు ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అయితే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ఫైనల్ బిల్లులు ఎందుకు ఆలస్యమయ్యాయని కమిషన్ అడిగింది. సుందిళ్ల, అన్నారం ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయని సుధారకర్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సమర్పించలేదని చెప్పారు. అలాగే కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని.. వరద వేగాన్ని అంచనా వేయలేకపోయారని తెలిపారు. అందుకే ఆ సమయంలో బ్లాకులు దెబ్బతిన్నట్లు స్పష్టం చేశారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఇదిలాఉండగా శుక్రవారం కమిషన్ జరిపిన విచారణలో కూడా మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కేసీఆర్ పై కీలక ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వ్యాప్కోస్ తయారు చేసిన కాళేశ్వరం డీపీఆర్ ను ప్రభుత్వం ఆమోదించిందని, ఆనాడు సీఎంగా కేసీఆర్ అనుమతి ఇస్తూ సంతకం చేశారని కమిషన్ ఎదుట చెప్పారు. నిర్మాణం చేపట్టే క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను కేసీఆరే మార్చమన్నట్లు తెలిపారు.