/rtv/media/media_files/2024/12/09/Se5lpQtw3p9i4OApxJIV.jpg)
Group-2 final results released!
Breaking: తెలంగాణలో అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రూప్-2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాల జీఆర్ఎల్‌ను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం విడుదల చేశారు. మొత్తం 18 రకాల పోస్టులకు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఒక వెకెన్సీని విత్ హెల్డ్‌లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. ఓఎంఆర్ పత్రాలలో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం తదితర కారణాలతో 13,315 మందిని కమిషన్ అనర్హులుగా తేల్చింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థులకు సంబంధించిన మార్కులు, జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 11న విడుదల చేసింది.
మొత్తం 783 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్స్ వెల్లడించింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది. కాగా, 783 పోస్టులకు గాను 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మూడు దశల్లో ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. తుది ప్రక్రియ అంతా ముగియడంతో.. ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను టీజీపీఎస్సీ ఈ రోజు విడుదల చేశారు. తర్వాత వెను వెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. https://www.tspsc.gov.in/
ఇది కూడా చూడండి: TG News: హైదరాబాద్‌లో పోకిరీల అరాచకం.. పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్‌ను ఆపి.. కాళ్లు మొక్కించుకుని..!