Group-2 Results: త్వరలో గ్రూప్-2 ఫలితాల వెల్లడి..ఎప్పుడంటే?
రాష్ట్రంలో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 సర్వీసు పోస్టులకోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ మేరకు వీలయినంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది.