Musi River: మూసీ నది ప్రక్షాళనకు అధికారుల ముందడుగులు

మూసీ నది ప్రక్షాళనకు అడుగులు ముందుకు పడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌ వద్ద మూసీ నదిపై ఉన్న నిర్మాణాలను ఆర్డీవో అధికారులు పరిశీలించారు. అక్కడి నివాసాలు, దుకాణాల పర్మిషన్‌ల వివరాలు సేకరిస్తున్నారు.

Musi 2
New Update

మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.లక్ష 50 వేల కోట్లతో ఈ పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌ ఇటీవలే ప్రకటన చేశారు. అయితే మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌ వద్ద మూసీ నదిపై ఉన్న నిర్మాణాలను ఆర్డీవో అధికారులు పరిశీలించారు. అక్కడి నివాసాలు, దుకాణాల పర్మిషన్‌ల వివరాలు సేకరిస్తున్నారు. పనులు ప్రారంభించేందుకు భూసేకరణ, అలాగే నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.  

Also Read: 15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

నగరంలోని వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 16 వేల ఇళ్లను మూసీ నిర్వాసితులకు అప్పగించేలా మంగళవారం ప్రభుత్వం జారీ చేసింది. గత కొన్ని నెలల పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ఉన్న మూసీ నదిపై సర్వే జరుగింది. రెవెన్యూ అధికారులు మూసీ బఫర్‌జోన్‌లో 10,200 నిర్మాణాలను గుర్తించారు. వాళ్లలో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు బుధవారం నుంచి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు.   

#telugu-news #hyderabad #musi-river
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe