/rtv/media/media_files/2025/10/22/checkposts-closed-2025-10-22-15-36-18.jpg)
Checkposts closed
Transport Check Posts : రాష్ట్రంలోని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. అంతేకాక చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ వెంటనే తొలగించాలని టీడీవోలకు సూచిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు.ఆర్థిక ,పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వడంతో పాటు చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదికను ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఆదేశించారు.
కాగా గత ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, కామారెడ్డి, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ క్రమలో ఆయా చెక్ పోస్టుల వద్ద భారీగా అవినీతి జరుగుతుందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఉత్తర్వులు వెలువడటంతో ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతుందనే విషయం ఆసక్తిగా మారింది.
Follow Us