TG News: తెలంగాణలో ప్రభుత్వం భూములు ఓఎల్ఎక్స్ లో వేలానికి పెట్టడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో వెంచర్ వేసి, ఫొటోలు తీసి తక్కువ ధరకే ఫ్లాట్లు అమ్ముతున్నామంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు రెవెన్యూ, మున్సిపల్ అనుమతులు లేకుండా 477 ప్లాట్లు విక్రయించినట్లు డిప్యూటీ ఎమ్మార్వోకి బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది.
ఇది కూడా చదవండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!
కబ్జాదారుల బహిరంగ ప్రకటన..
ఈ మేరకు గాజుల రామారంలో గవర్నమెంట్ ల్యాండ్ లో వెంచర్ చేసిన కొంతమంది.. వాటిని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. అయితే ఈ విషయాన్ని వెంటనే డిప్యూటీ ఎమ్మార్వోకి దృష్టికి తీసుకెళ్లారు కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకుడు ఆకుల సతీష్. ప్రముఖ ఈ కామర్స్ సైట్ (ఓఎల్‌ఎక్స్)లో ఫొటో, భూమి కొలతలు, జీపీఎస్ ఫొటోలతో సహా ప్రకటన ఇచ్చినట్లు ఆధారాలు చూపించారు. అంతేకాదు మీకు భూమి కావాలంటే ఈ కింది నంబర్ కు కాల్ చేయంటూ బహిరంగ ప్రకటన చేసినట్లు చూపించడం విశేషం.
ఇది కూడా చదవండి: 20 రూపాయల పెట్రోల్ కోసం గొడవ.. యువకులకు పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం
అనుమతులు లేకుండా 477 ప్లాట్లు అమ్మకానికి..
హైదరాబాద్ నగర శివారులో సర్వే నంబర్ 307 గాజుల రామారం, బాలయ్య బస్తీ పక్కన ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ భూమిని భూమి ఆక్రమించారు. రెవెన్యూ, మున్సిపల్ అనుమతులు లేకుండా 477 ప్లాట్లు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అమ్మేందుకు సిద్ధం చేశారు. తక్షణమే ఎవరూ మోసపోకుండా ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడే పనిలో ఉంటే.. కొంతమంది అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఆయన ఆకుల సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు.
ఇది కూడా చదవండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!
ఇది కూడా చదవండి: Rotten Chicken: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!