/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బదిలీల్లో అత్యంత కీలకమైనది సింగరేణి సంస్థకు కొత్త MDని నియమించడం. ఇప్పటివరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఇన్-చార్జి బాధ్యతలు నిర్వహించిన కృష్ణ భాస్కర్‌ను ఆ బాధ్యతల నుండి తప్పించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు కొందరికి కీలక శాఖల అదనపు బాధ్యతలు అప్పగించారు.
#Hyderabad:#IAS transfers and postings in #Telangana
— NewsMeter (@NewsMeter_In) February 11, 2026
Dr. Jyoti Buddha Prakash, IAS (2002) is the new Chairman & Managing Director of #Singareni Collieries Company Limited (SCCL).
R.V.Karnan, IAS (2012) shall continue in the post of @GHMCOnline Commissioner.
G.Srijana, IAS… pic.twitter.com/GyOLKJhS1n
సబ్యసాచి ఘోష్: గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడతారు.
సందీప్ కుమార్ సుల్తానియా: ప్రణాళిక శాఖతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (TGRAC) డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తారు.
దివ్య దేవరాజన్: పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 'ప్రజావాణి'కి నోడల్ అధికారిగా కాత్యాయని దేవి నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్ శర్మ, జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు చేపట్టనున్నారు. అడ్మినిస్ట్రేషన్ మరింత వేగవంతంగా పని చేయాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Follow Us