Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!

రామగుండం - పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. చెన్నై - డిల్లీ ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

train
New Update

Train Accident: ఐరన్‌ లోడ్‌ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి  బోల్తా పడింది. దీంతో చెన్నై- ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ ఘటన పెద్దపల్లి-రామగుండం మధ్య జరిగింది. ఘజియాబాద్ నుండి కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ - కన్నాల మధ్య పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తా పడిపడంతో ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది.

Also Read:  AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!

 ఓవర్ లోడ్ తోనే గూడ్స్ రైలు బోల్తా పడినట్లు అధికారులు అనుకుంటున్నారు. గూడ్స్ బోల్తా పడటంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Also Read:  Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు

పెద్దపల్లి రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ నుండి బళ్లార్షా వైవు వెళ్లే భాగ్య నగర్ ఎక్సప్రెస్ రైలు, మధురై నుండి హాజ్రత్ నిజముద్దీన్ కు వెళ్లే సంపార్క్ క్రాంతి రైలు ఆగిపోయాయి కొత్తపల్లి రైల్వే స్టేషన్ లో చెన్నై నుండి ఢిల్లీ కి వెళ్లే లక్నో ఎక్స్‌ప్రెస్ రైల్ ను ఆపేశారు. గూడ్స్ రైలు బోల్తాతో రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు మొదలు పెట్టారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. 

బుదవారం ఉదయం వరకు రైళ్ళు నడిచే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర మంత్రి 

రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  నాగ్ పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్..సమాచారం తెలిసిన వెంటనే సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులకు ఫోన్ చేసి విషయం గురించి కనుకున్నారు. 11 బోగీలు, పట్టాలు మూడు రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు కేంద్రమంత్రికి తెలిపారు.

Also Read:  Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

పెద్దపల్లి..రామగుండం వైపు వెళ్లే రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. తక్షణమే రైల్వే ట్రాక్ ను పునరుద్దరించాలని కేంద్ర మంత్రి కోరారు. పెద్దపల్లి రామగుండం మార్గంలోని ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని బండి ఆదేశాలు జారీ చేశారు.  బుధవారం ఉదయానికల్లా రైల్వే ట్రాక్ ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read:  Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!

పునరుద్ధరణకు 24గంటలు..


కన్నాల గేట్‌ వద్ద 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్‌-బల్లార్షా మధ్య ఉన్న మూడు రైల్వే లైన్లు  పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. .ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయాయి. విద్యుత్‌  పోల్స్‌ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కష్టంగా ఉన్నాయి.

రైలు ఇంజిన్, గార్డ్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పలేదు. మధ్యలో ఉన్న బోగీలుపడిపోయాయి. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు రాత్రి 11 గంటల తరువాత అధికారులు మొదలు పెట్టారు. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్‌ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లి స్టేషన్‌ లో ప్రయాణికులను దించేశారు.  రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.

#train-accident #goods-train
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe