Medaram Jatara : మేడారం భక్తులకు గుడ్‌న్యూస్‌..జాతరలో హెలికాప్టర్‌ రైడ్స్‌ షురూ

మేడారం జాతర భక్తజన గుడారంగా మారిపోయింది. మేడారం వచ్చే భక్తులకు ఈరోజు నుంచి హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులోకి వచ్చాయి. పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జీ చేస్తారు.

author-image
By Madhukar Vydhyula
New Update
FotoJet - 2026-01-22T124221.584

Helicopter rides begin Medaram Jatara

Medaram Jatara :  సమ్మక్క...సారలమ్మ కొలువైన మేడారం జాతర భక్తజన గుడారంగా మారిపోయింది.  మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కితె వరమిచ్చే వనదేవతలకు భక్తులు బంగారం సమర్పిస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా ములుగు జిల్లా మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురువయ్యాయి. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు  టూరిజం శాఖ జాతరలో హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

మేడారం వచ్చే భక్తులకు ఈరోజు నుంచి హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులోకి రానున్నాయి. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జీగా నిర్ణయించారు. హనుమకొండ నుండి మేడారం అప్ డౌన్ కు రూ.35,999 ఛార్జీగా నిర్ణయించారు. ఈనెల 31 వరకు ఉ.8 గంటల నుండి సాయంత్రం 5.20 వరకు హెలికాప్టర్ రెడ్స్ అందుబాటులో ఉండనున్నాయి  

 మేడారం వచ్చే భక్తులు కోసం హన్మకొండలోని ఆర్ట్స్​అండ్​సైన్స్​కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​ నుంచి మేడారం వరకు గురువారం (జనవరి 22) నుంచి పదిరోజుల పాటు ఈ సేవలు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆకాశం నుంచి మేడారం జాతర దృశ్యాలను తిలకించేందుకు కూడా  ఈ హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేసినట్లు టూరిజం శాఖ తెలిపింది. 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.4వేల 800 ఛార్జ్ చేస్తారు. హనుమకొండ నుంచి మేడారం అప్ డౌన్ కు రూ.35వేల999 లు ఛార్జీలు వసూలు చేస్తారు. జనవరి 31 వరకు ఉ.8 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు హెలికాప్టర్ రెడ్స్ అందుబాటులో ఉంటాయి.  పూర్తి వివరాలకు 8530004309, 9676320139 నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 

Advertisment
తాజా కథనాలు