విశ్వనగరం దిశగా హైదరాబాద్ ముందుకెళ్తోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. త్వరలో ఫోర్త్‌సిటీ (ఫ్యూచర్ సిటీ)ని కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌కు మరో కొత్త ప్రాజెక్టు రానుంది. నగరానికి దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీ నిర్మించనున్నారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ) స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్ సంస్థతో కలిసి ముందుకు వచ్చిందని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?
ప్రభుత్వం సహకరిస్తే అవికూడా
అమెరికాలోని టెక్సాస్‌లో ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా నడుస్తున్న పీజీఏ ప్రతినిధి బృందం, స్టోన్ క్రాఫ్ట్ సభ్యులు శనివారం సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. '' తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే గోల్ఫ్ కోర్సులు, నివాస సముదాయాలు, హోటళ్లు, అలాగే వినోద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పీజఏ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ ముంబయిలోని షాపూర్జీ పల్లొంజి సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీని నిర్మిస్తోంది. ఇక్కడ కూడా స్టోన్ క్రాఫ్ట్ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.
Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?
10 వేల మందికి ఉపాధి
మొత్తం 200 ఎకరాల్లో 18 హోల్ ప్రామాణిక గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేస్తుంది. ఇది వినియోగంలోకి వస్తే ఈ తరహా కోర్సు దక్షిణ భారత్‌లోనే మొదటిది అవుతుంది. దీని వల్ల వచ్చే పదేళ్లలో 10 వేల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ సంస్థలు ఫోర్త్‌సిటీలో ఎలాంటి కాలుష్యం వెలవడని నెట్-జీరో సిటీని నిర్మిస్తాయి'' అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో స్టోన్ క్రాఫ్ట్ సీఈవో కీర్తి చిలుకూరి, అలోక్ తివారీ, పీజీఏ ప్రతినిధులు టిమ్‌లాబ్, అలెక్స్ హే తదితరులు పాల్గొన్నారు.
Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?
Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..