/rtv/media/media_files/2025/03/14/oLiTQE6NJOHT38bAMnzD.jpg)
Priest Invites Muslims to Iftar Party
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పూజారి మతసామరస్యాన్ని చాటుకున్నారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చి మతం భేదం లేదని చూపించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇల్లెందు స్టేషన్ బస్తీలోని గణేశ్ ఆలయంలో హరగోపాల్ శర్మ పూజారిగా ఉంటున్నారు. ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతీరోజూ ముస్లింలు ఉపావాస దీక్ష అయిపోయాక ఇఫ్తార్ విందు చేస్తారు. ఈ క్రమంలోనే హరగోపాల్ శర్మ.. ముస్లింలను తన ఇంటికి ఇఫ్తార్ విందు కోసం ఆహ్వానించారు.
Also Read: టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?
వాళ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పలు రకాల వంటకాలు వడ్డించారు. అలాగే తన ఇంటికి వచ్చిన ముస్లింలను శర్మ అభినందించారు. అలాగే శర్మను కూడా అక్కడి స్థానికులు ప్రశంసిస్తున్నారు. కుల, మత భేదాలతో కొట్టుకుంటున్న ఈరోజుల్లో ఇలాంటివి చూసినప్పుడే మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేననే భావన కలుగుతుందని అంటున్నారు. ఇదే మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం అని కొనియాడుతున్నారు.
Also Read: ట్రైన్ హైజాక్‌లో భారత్ హస్తముందున్న పాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా