Formula E Case: ఫార్ములా ఈ కేసు.. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు

తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.

New Update
KTR Formula E Race Case

KTR Formula E Race Case

 Formula E Case:  తెలంగాణలో ఫార్ములా ఈ--కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇంతకు ముందు మే 28న విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్టు షెడ్యూల్‌ ప్రకారం అమెరికాలో జరగనున్న బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు వెళ్లాల్సి ఉన్నందును తను హాజరు కాలేనని ఆయన తేల్చి చెప్పారు. కాగా కేటీఆర్‌ అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో  ఏసీబీ  మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.  


కాగా గత నెలలోనే మే 28న ఏసీబీ కేటీఆర్‌ను విచారణకు పిలిచింది. అయితే "ఫార్ములా ఈ-రేస్ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కేసు అయినప్పటికీ, నేను కచ్చితంగా ఏసీబీకి సహకరిస్తాను. అయితే నేను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు యూకే, యూఎస్ఏ వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకున్నాను. తిరిగి రాగానే విచారణకు హాజరవుతాయని ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశాను" అంటూ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. అయితే కేటీఆర్‌ జాబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో అర్థంతరంగా తన పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చారు. దీంతో ఏసీబీ మరోసారి ఆయనను విచారించే అవకాశం ఉంది.

 కాగా, ఫార్ములా ఈ--కేసులో  ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విడివిడిగా విచారించింది. అయితే ఆ సమయంలోనే అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తేల్సి చెప్పారు. అయితే  ఆతర్వాత చాలాకాలం వరకు ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురినీ మరోసారి విచారిస్తారని ప్రచారం సాగినా అది జరగలేదు. అయితే కేటీఆర్‌ అమెరికా పర్యటన ఖరారైన తర్వాత నోటీసులు జారీ చేయడం చర్చనీయంశంగా మారింది.  అయితే కేటీఆర్‌ అమెరికా వెళ్లడంతో మరోసారి వాయిదా పడింది. అయితే ఈసారి మరోసారి నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్‌ విచారణకు వెళ్లే అవకాశం ఉంది.  

Advertisment
తాజా కథనాలు