Ram Reddy passes away : మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి..కన్నీరు పెట్టిన ఆత్మీయులు

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి అనారోగ్యంతో కనుమూశారు. కాంగ్రెస్‌ కంచుకోటగా పిలవబడే  మంథని నియోజకవర్గంలో రాజకీయ ఉద్ధండుడు ప్రస్తుత ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తండ్రి, మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావును 1994లో రాంరెడ్డి ఓడించారు.

New Update
FotoJet (6)

Former MLA Chandrapatla Ram Reddy

 Ram Reddy passes away : కాంగ్రెస్‌ కంచుకోటగా పిలవబడే  మంథని నియోజకవర్గంలో రాజకీయ ఉద్ధండుడు ప్రస్తుత ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తండ్రి, మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావును ఓడించి టైగర్‌ రాంరెడ్డిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం మరణించారు. అనారోగ్య సమస్యలతో  హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి, గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, తరువాత ముత్తారం మండల ఎంపీపీగా పనిచేశారు.

1994లో, ఆయన టీడీపీ టికెట్‌పై మంథని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విదేశాల్లో స్థిరపడగా, చిన్న కుమారుడు సునీల్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించి టీడీపీ, టీఆర్‌ఎస్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. ముక్కుసూటి మనిషిగా, రైతుల పక్షపాతిగా రాంరెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. కాగా రాంరెడ్డి మృతితో ఆయనతో అనుబంధం ఉన్న ఆత్మీయులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా రాంరెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీధర్‌ బాబు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా మాజీ శాసనసభ్యుడి మృతికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, శ్రేయోభిలాషులు, ఇతరులు సంతాపం తెలిపారు. రాంరెడ్డి మృతదేహాన్ని మంగళవారం మంథనికి తరలించి, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisment
తాజా కథనాలు