BIG BREAKING: బీజేపీలోకి చేరిన గువ్వల బాలరాజు!

అచ్చంపేట బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలోకి చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు గువ్వలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి గువ్వల రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

New Update

అచ్చంపేట నియోజకవర్గం మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలోకి చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు గువ్వలకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. రోజురోజుకీ బీజేపీ పార్టీ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీని బలోపితం చేయడానికి గువ్వల బాలరాజు సేవలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు సీనియర్‌ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని మొదట్లో అందరూ భావించారు. ఆ తర్వాత రాం చంద్రరావును కలవడంతో బీజేపీలోకి చేరడం ఫిక్స్ అని అనుకున్నారు. ఊహించినట్లుగానే గువ్వల బీజేపీలోకి చేరారు.

ఇది కూడా చూడండి: Pulivendula ZPTC BY Election: వైఎస్ కంచుకోటలో జడ్పీటీసీ వార్.. ఈ సారి గెలుపు ఆ పార్టీదేనా?

ఇది కూడా చూడండి:  BIG BREAKING: సీఎం రేవంత్ సొంత జిల్లాలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ ఐదుగురు నేతలు జంప్?

వంశీకృష్ణ చేతిలో ఓడిపోయిన గువ్వల బాలరాజు

ఇదిలా ఉండగా గువ్వల బాలరాజు రాజకీయాల్లోకి మొదటిసారి 2009లో ఎంట్రీ ఇచ్చారు. టీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఘోర ఓటమిపాలయ్యరు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇందులో 11,820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో రెండవ సారి ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీపై 9,441 ఓట్ల మెజారిటీతో గువ్వల విజయం సాధించారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. అప్పుడు చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయాడు.

Advertisment
తాజా కథనాలు