పౌర సరఫరాల అధికారులు హోటళ్లపై దాడులు చేస్తూ కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వాణిజ్య సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లు వాడుతూ ప్రభుత్వ రాయితీని పక్కదారి పట్టిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు పట్టణంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయా హోటళ్లలో తనిఖీ చేశారు. దాదాపు 20కి పైగా గృహ వినియోగ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి రాయితీ సిలెండర్లు వాడితే కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీ తెలిపారు.
Telangana: ఆదిలాబాద్‌లో హోటళ్లపై పౌర సరఫరా అధికారుల తనిఖీలు
ఆదిలాబాద్ పట్టణంలోని పౌర సరఫరాల అధికారులు హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లలో వాణిజ్య సిలెండర్లకు బదులు వాడుతున్న 20కి పైగా గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఇవి వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
New Update
Advertisment