Hyderabad Food: ఫుడ్‌ క్వాలిటీలో హైదరాబాద్‌ లాస్ట్‌...!

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నిర్వహించిన సర్వే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. హోటల్స్‌ లో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సర్వేలో తెలిసింది. కల్తీ ఆహారంలో టాప్‌ ప్లేస్‌ లో హైదరాబాద్ నిలవగా...ఫుడ్‌ క్వాలిటీ విషయంలో చివరి స్థానంలో నిలిచింది.

biryani
New Update

Hyderabad: బిర్యానీ కి పెట్టింది పేరు...హైదరాబాద్‌. ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారంటే అతి శయోక్తి కాదు. హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. విదేశీయులు కూడా హైదరాబాద్‌ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తింటారు. ఈ క్రమంలోనే.. విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడి ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటారనేవిషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Also Read:  Hyderabad: యాసిడ్‌తో అల్లం పేస్ట్‌...ప్రముఖ హోటళ్లకు ఇదే సరఫరా!Hyderabad biryani  

గతంలో ఫుడ్‌ క్వాలిటీ పరంగా అనేక స్టార్ రేటింగ్స్‌ను హైదరాబాద్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీ కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే కాదు, విదేశీయులు కూడా ఇష్టంగా తింటూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.  అంతే కాదు, ఇక్కడి బిర్యానీ నిత్యం వేలాది పార్శిల్స్ రూపంలో ఇతర దేశాలకు వెళ్లడం కూడా తెలిసిన విషయమే. 

Also Read:  Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు!

కానీ ఇప్పుడు పరిస్థితి ఆహార భద్రతపరంగా ఆందోళనకరంగా మారింది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినడం ప్రమాదకరమైపోయినట్లు తెలుస్తోంది.తాజాగా జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడుల్లో  కొన్ని నమ్మలేని విషయాలు వెలుగులోకి  వచ్చాయి. అక్కడ కుళ్లిన చికెన్ తో పాటు పురుగులు పట్టిన అల్లంవెల్లుల్లి పేస్టులు, పాడైపోయిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను బిర్యానీలోకి ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, పలు ఇతర జంతువుల అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. ఈ పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేశారు. 

Also Read:  Manipur: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్ష

ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానంలో...

ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా చేసిన సర్వే  ప్రస్తుతం సంచలనం రేపుతుంది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానంలో నిలిచింది. నగరంలోని 62 శాతం హోటళ్లు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఫుడ్ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సిటీ పూర్తిగా విఫలమైందని సర్వే వెల్లడించింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా హైదరాబాద్‌ ఉంది.

Also Read: Maharashtra : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంట‌ర్

బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అయితే.. హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దీంతో.. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి.

#Hyderabad Food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe