Karimnagar : విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి!

TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐదేళ్ల చిన్నారి గుండెపోటు మరణించడం స్థానికంగా కలచివేసింది. రాజు-జమున దంపతుల కూతురు ఉక్కులు నిన్న ఉదయం కళ్ళుతిరుగుతున్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఆమె చనిపోయింది.

heat attack
New Update

Heart Attack : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలకు ఇప్పుడు మరో భయం వెంటాడుతోంది. కరోనా  తరువాత ఇప్పుడు గుండెపోటు మరణాలు ఆందోళన కల్గిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా చోట్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తరువాత గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇటీవల కొన్ని  సర్వేలు నివేదికలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే

ఐదేళ్ల చిన్నారికి గుండెపోటు...

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి గుండెపోటు తో మరణించిన ఘటన కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నివాసం ఉంటున్న రాజు- జమునకు ఐదేళ్ల వయసు ఉన్న కూతురు ఉంది. నిన్న ఉదయం వాళ్ళ కూతురు ఉక్కులు తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ డాక్టర్ హన్మకొండకు రిఫర్ చేశారు. దీంతో ఆమెకు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉక్కులుకు వైద్యులు పరీక్షలు చేస్తుండగా ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించకపోవడంతో మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కళ్ళ ముందే తమ పసికూన చనిపోవడాన్ని చూసి గుండెలు బాదుకుంటున్న తల్లిదండ్రుల బాధ స్థానికంగా కలచి వేసింది.

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

గుండెపోటు లక్షణాలు...

విపరీతమైన చెమట:

ఆరోగ్య దృక్కోణంలో, చెమటతో కూడిన మై-కై కలిగి ఉండటం మంచిది, కానీ మీరు ఫ్యాన్ లేదా AC కింద కూర్చున్నప్పటికీ, మీ మై-కై ఎటువంటి కారణం లేకుండా నెమ్మదిగా చెమట కారుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కూడా గుండె జబ్బులకు ముఖ్యమైన లక్షణం. మీరు ఎటువంటి కారణం లేకుండా తరచుగా చెమటలు పడుతుంటే, గుండె పని చేయడానికి కష్టపడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!

ఛాతీ నొప్పి:

గుండెకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తుంది.. కానీ ఛాతీకి సంబంధించిన ప్రతీది గుండెపోటు కాదని తెలుసుకోవాలి. కొన్నిసార్లు గుండెలో మంట కనిపించినప్పుడు, గుండెల్లో మంట వచ్చినప్పుడు ఛాతీ నొప్పి కూడా రావచ్చు! నిర్లక్ష్యం చేయకండి, ఈ సమస్య పదేపదే కనిపిస్తే, వెంటనే డాక్టర్ని సంప్రదించండి.

దవడ నొప్పి:

గుండెపోటు ప్రధాన లక్షణాల్లో దవడ నొప్పి కూడా ఒకటి! ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గుండెపోటు రావడానికి ముందు భుజాలు, చేతులు, వీపు, మెడ దగ్గర నొప్పి కనిపించడంతో పాటు దవడలో కూడా నొప్పి వస్తుంది!

శ్వాస సమస్య:

గుండెపోటు యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో శ్వాస ఆడకపోవడం ఒకటి! అయితే మగవాళ్లకు ఇది సాధారణమైతే, ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

వెన్నునొప్పి:

పురుషుల కంటే మహిళలకు వెన్నునొప్పి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి హృదయ విదారకమైన హెచ్చరిక సంకేతాలు కూడా. విపరీతమైన వెన్నునొప్పి పురుషులు, స్త్రీలలో గుండెపోటు యొక్క లక్షణం కావచ్చు. కానీ మహిళలు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి.

Also Read :  స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..!

#heart-attack #karimnagar #health-problem
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe