Siddipet: ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తండ్రి!

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సత్యం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 

author-image
By srinivas
New Update
TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా!

Siddipet: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఈ మేరకు పోలీసుల వివరాల ప్రకారం.. వివేకనందనగర్‌ కాలనీకి చెందిన సత్యం(49) కొంతకాలంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతుండేవారు. అయితే పదేళ్ల క్రితం భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు పిల్లలు త్రివర్ణ హాసిని(5), కుమారుడు అన్వేష్‌నందా (7) ఉన్నారు. అయితే ఇన్ని రోజులు బాగానే ఉన్న సత్యం.. శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని చింతల్‌ చెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. 

ఇది కూడా చదవండి: Gambhir: గంభీర్‌ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!?

సోదరుడికి రూ.4 లక్షలు అప్పు ఇవ్వడమే పాపం..

ఇక భర్త, పిల్లలు కనిపించట్లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలించి మృతదేహాలను వెలికి తీసి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యం గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు సత్యం తన సోదరుడికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చాడని, అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పరిశ్రమలకు హైదరాబాద్ ఎంట్రీ పాయింట్ : మంత్రి శ్రీధర్ బాబు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు