/rtv/media/media_files/KkGzfwujozuR5YYJ4EsK.jpg)
మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ పుట్టిన రోజు వేడుక గురువారం జరిగింది. . ఈ సందర్భంగా కేసీఆర్.. తన సతీమణికి కేక్ తినిపించారు. కూతురు కవిత కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. గత కొన్నిరోజులుగా కేసీఆర్ బయట కనిపించడం లేదు. ప్రెస్‌మీట్‌లు, సభలు, వేడుకలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా తన సతీమణి వేడుకల్లో పాల్గొన్న ఫొటో బయటికొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరలవుతోంది. మరోవైపు కవిత కూడా జైలు నుంచి విడుదలయ్యాక బయట ఎక్కడా కనిపించలేదు. ఆమె కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.