/rtv/media/media_files/2025/12/05/kcr-2025-12-05-19-33-44.jpg)
KCR
తెలంగాణలో డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పినట్లు సమాచారం. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వారికి దిశానిర్దేశం చేయగా.. తాను కూడా అసెంబ్లీకి వస్తానని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా కూడా కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇప్పటివరకు ప్రశ్నించలేదు. ఈసారి ఆయన అసెంబ్లీకి రానున్నారనే వార్తలు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. ఒకవేళ ఆయన నిజంగానే వస్తే రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టడం ఖాయమని బీఆర్‌ఎస్ కార్యకర్తలు అంటున్నారు.
Follow Us