/rtv/media/media_files/2025/01/20/I0quxOnPxazIphWiiOpN.jpg)
ips transewr Photograph: (ips transewr)
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ లు బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరి ఎనిమిది మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్ నియమితులయ్యారు.
ఐపీఎస్ ల రిలీవ్..
మరోవైపు నిన్న ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో చేరేందుకు వీలుగా వెంటనే రిలవ్ చేస్తున్నామని సీఎస్ శాంతికుమారి జీవోలో తెలిపారు. అలాగే కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అభిషేక్ మహంతి రిలీవ్‌పై ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. కరీంనగర్‌లో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభిషేక్ మహంతి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఇదిలాఉండగా.. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీకుమార్, తెలంగాణ పోలీసు అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఏపీకి వెళ్లాలని కేంద్ర హోంశాఖ శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: TS: మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ