తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.7 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3.71 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.రోడ్డు మార్గం ద్వారా విదేశీ బంగారాన్ని తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు నగర శివారులో రాయికల్ టోల్‌ప్లాజా వద్ద అధికారులు వాహనాన్ని అడ్డుకున్నారు. కారు హ్యాండ్ బ్రేక్ దిగువన ప్రత్యేకంగా తయారు చేసిన క్యావిటలో బంగారం దాచినట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: లగ్జరీ వాచ్‌లు కొన్న పొంగులేటి కొడుకు.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే ?