MP Arvind : నా మీద హై కమాండ్‌కు ఫిర్యాదు చేయకండి..ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్

జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ బీజేపీలో ఉన్న అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావును ఉద్దేశించి బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేసిన కామెంట్స్‌ తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి.

New Update
FotoJet - 2025-11-07T153927.975

BJP MP Arvind Dharmapuri

MP Arvind : జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ బీజేపీలో ఉన్న అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావును ఉద్దేశించి బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేసిన కామెంట్స్‌ తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటిదాకా జూబ్లిహిల్స్ ప్రచారంలో  ఎక్కడ కనిపించని ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను చెప్పకనే చెప్పింది.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నేను జూబ్లిహిల్స్ ప్రచారం చేయడం లేదని అనుకోకండి. నేనిప్పుడు మాట్లాడేది జూబ్లిహిల్స్ ప్రచారమే. మీరు చేసిన ప్రచారం కంటే నేను మాట్లాడే నా సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువగా ఉంది. హలో రామ చందర్ రావు గారు నా మీద బీజేపీ హైకమాండ్ కు ఫిర్యాదు చేయకండి. అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావును ఉద్దేశించి ఆయన కామెంట్స్‌ చేశారు.

నిజామాబాద్ బీజేపీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలుసు అంటూనే..స్టేట్ ప్రెసిడెంటు రాంచందర్‌ రావుకు చురకలు అంటించారు అరవింద్. మా నిజామాబాద్ బీజేపీ  ప్రొడక్ట్  పక్కనే ఉందంటూ... పక్కనే కూర్చొన్న MLA పైడి రాకేష్ రెడ్డిని అరవింద్‌ చూపించడం చర్చనీయంశమైంది. ఇప్పటిదాకా జూబ్లిహిల్స్ ప్రచారంలో  ఎక్కడ కనిపించని ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ రోజు చేసిన వ్యాఖ్యాలు పెను సంచలనంగా మారాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలను ఆయన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తు్న్నాయి.అరవింద్ వ్యాఖ్యలతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. కాగా నెలరోజులుగా  జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఎక్కడ కనిపించలేదు.  

Also Read: Vijay - Rashmika: బిగ్ న్యూస్..  విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్! వైరలవుతున్న పోస్ట్

Advertisment
తాజా కథనాలు