Dharani : ”అలా చేయండి”.. ప్రభుత్వానికి ధరణి కమిటీ కీలక సూచనలు

ధరణి కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 2020 సెప్టెంబర్‌లో ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా ? లేదా ? అని తనిఖీ చేసేందుకు పోర్టల్‌కు సంబంధించి థర్డ్‌ పార్టీ ఆడిట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది.

New Update
Dharani

ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రేవంత్‌ సర్కా్ర్ ముందడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలతో మాట్లాడిన ధరణి కమిటీ తుది నివేదికను సైతం రూపొందించింది. అయితే తాజాగా కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 2020 సెప్టెంబర్‌లో ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా ? లేదా ? అని తనిఖీ చేసేందుకు పోర్టల్‌కు సంబంధించి థర్డ్‌ పార్టీ ఆడిట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. 

అయితే ధరణి పోర్టల్‌లో స్థలాల యజమానుల పేర్లను, సర్వే నెంబర్లను, భూమి విస్తరణను మార్చడం.. అలాగే పలు సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పెట్టడం, తప్పులు నమోదు చేయడం లాంటి అనాధికార మార్పులు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిని పరిశీలించేందుకు కమిటీ.. మూడో పార్టీ ఆడిట్‌ను తీసుకోవాలని రేవంత్‌ సర్కార్‌కు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ప్రభుత్వ డేటాను కాపాడటం, ప్రజల ప్రైవసీ సమస్యలను పరిష్కరించడం కోసం ధరణి పోర్టల్‌ను నియంత్రించే బాధ్యతను నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్ (NIC), సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (CGG), లేదా టీఎస్‌ఆన్‌లైన్ లాంటి ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని సూచించింది.

Also Read: మూసీకి పూర్వ వైభవం దిశగా అడుగులు.. అక్కడ ఉండేవాళ్లకి బిగ్ షాక్

కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం.. రైతు కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి, భూములు నిపుణుడు ఎం. సునిల్‌ కుమార్‌ తదితర అధికారులతో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ధరణి పేరుకు త్వరలోనే భూమాత అనే నామకరణం కూడా చేయనుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న రైట్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(RoR) యాక్ట్, 2020 లోని పలు మార్పులు చేసి, కొత్త నిబంధనలు తీసుకొచ్చి మళ్లీ ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌, 2024 ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే భూ సంస్కరణలను చేపట్టడంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు ల్యాండ్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ సెల్ అలాగే లీగల్ సపోర్ట్ సెల్‌ను రూపొందించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సూచించింది.

పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లను పరిష్కరించడం మాత్రమే కాకుండా.. ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపింది. దీని ద్వారా రెవెన్యూ సదస్సులు, నిషధిత స్థలాల జాబితాలను సరిచేయడం, అప్‌డేట్ చేయడం లాంటి భూ ఫిర్యాదుల ఆర్జీలను స్వీకరించాలని చెప్పింది. అలాగే నిషేధిత స్థలాల జాబితా నుంచి 1958 కన్నా ముందు ఉన్న అసైన్డ్‌ భూములను డిలీట్‌ చేయాలని కోరింది. అయితే బీఆర్ఎస్‌ హయాంలో వీఆర్వో, వీఆర్‌ఏలను రద్దు చేశాక గ్రామీణ స్థాయిలో రైతులకు సపోర్ట్ చేసే అధికారి ఎవరూ కూడా లేదు. అందుకే రైతులకు అండగా ఉండేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ అడ్మినిస్టేషన్‌ను చూసుకునేందుకు ఓ బాధ్యతాయుతమైన వ్యక్తి ఉంచాలని కమిటీ భావిస్తోంది. ఇందుకోసమే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనివల్ల రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతోంది. అంతేకాదు విలేజ్‌ రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయడం వల్ల కూడా భూ సమస్యలను పరిష్కారమవుతాయని కమిటీ స్పష్టం చేసింది.

Also Read: రేషన్ కార్డులకు కొత్త రూల్స్.. ఆదాయం ఎంత ఉండాలో తెలుసా?

Advertisment
తాజా కథనాలు