Water: హైరిస్క్ కేటగిరీలో మినరల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. ప్రజలు బతకాడానికి కావాల్సిన నీరు మీద ఎప్పటకప్పుడు తనిఖీలు చేయడానికే ఈనిర్ణయం తీసుకున్నామని తెలిపింది.  

New Update
mineral water bottles

నీరు...ఇది లేనిదే మునుగడే కష్టం. ఇంతకు ముందులా ఎకడిపడితే అక్కడ నీరు తాగే పరిస్థితి లేదు. ఆ బాధ నుంచి తప్పించడానికే ప్యాకేజ్డ్‌, మినరల్ వాటర్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిల్లో కూడా కల్తీ జరుగుతోంది. ప్యాకేజ్డ్ వాటర్ అయితే సురక్షితం అనుకుని తాగుతున్నారు కానీ రోగాల బారిన పడుతున్నారు. శుభ్రమైన నీటిని ఇవ్వకుండా చాలా కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నాయి. వీటిని అరికట్టి...ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టిని కేంద్రీకరించింది ఎఫ్‌ఎస్ఎస్ఐ. ఇందుకోసం ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది ఫుడ్ అథారిటీ అండ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. వీటిని ఇలా చేరచడం వల్ల ఈ ఉత్పత్తులను తప్పని సరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించిన తర్వాత ఈ యాక్షన్ తీసుకున్నారు. 

ఎఫ్‌ఎస్ఎస్ఐతీసకున్న ఈ నిర్ణయం వలన అన్ని ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్ తయారీదారులను, ఉత్పత్తులను ఇప్పుడు ప్రతీ ఏడాది, అత్యున్నత తనిఖీలు చేస్తారు. లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ మంజూరు చేయడానికి ముందు ఈ తనిఖీలు జరుగుతాయి. హై-రిస్క్ కేటగిరి కిందకు వచ్చే ఉత్పత్తులు కఠినమైన భద్రతా చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.   గతంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS, FSSAI రెండింటి ధీవీకరణ అవసరం లేదని...అందుకే ఒకదానిని తొలగించాలని కంపెనీలు కోరాయి. సరళీకృత నిబంధనలకు పిలుపునిచ్చాయి. అది దృష్టలో పెట్టుకునే ఎఫ్‌ఎస్ఎస్ఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  కొత్త నిబంధనలు పర్మిషన్ల ప్రక్రియను క్రమబద్దీకరించడానికి, తయారీదారులపై భారాన్ని తగ్గించడానికి ఈనిర్ణయం సాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌ఎస్ఎస్ఐ ఆర్డర్ ప్రకారం.. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌తో సహా అధిక-రిస్క్ ఫుడ్ కేటగిరీలలోని వ్యాపారాలు చేసే.. గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఆహార భద్రతా ఏజెన్సీల వార్షిక ఆడిట్‌లను కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Also Read: Uber: షికారా పేరుతో ఊబెర్ కొత్త సేవలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు