BIG BREAKING: డిప్యూటీ సీఎం భట్టికి తప్పిన పెను ప్రమాదం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పెను ప్రమాదం తప్పింది. వరంగల్‌కు పర్యటనకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌లో పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ, డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే భట్టికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Police Vehicle

Police Vehicle

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పెను ప్రమాదం తప్పింది. వరంగల్‌కు పర్యటనకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌లో పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. జనగామ లోని పెంబర్తి కళాతోరణం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్‌ఐ, చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే భట్టి విక్రమార్కకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. 

Also Read: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి!

ఇదిలాఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల స్కూల్, కాలేజీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఆయన వెంట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. విద్యార్థులతో కలిసి వాళ్లు భోజనం చేశారు. ఆ తర్వాత భట్టి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని.. వాళ్లకి పౌష్టికాహారం అందించాలనే తమ ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచినట్లు పేర్కొన్నారు. 

Also read: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్

Also Read: అమెరికా ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయ నేతలు ప్రమాణ స్వీకారం

Advertisment
తాజా కథనాలు