Crypto Fraud : జగిత్యాలలో క్రిప్టో మోసం.. రూ.70 లక్షలు ఫట్

జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం వెలుగు చూసింది. జగిత్యాలకు చెందిన రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో పలువురి నుంచి రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.

New Update
 Crypto Fraud

Crypto Fraud

 Crypto Fraud : జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం వెలుగు చూసింది. జగిత్యాలకు చెందిన రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో పలువురి నుంచి రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లాకు చెందిన రాకేష్  తనకు తెలిసిన వారితో పాటు చాలా మందితో పరిచయాలు పెంచుకున్నాడు. అందరితో కలివిడిగా ఉండడంతో అంతా నమ్మారు. ఆ నమ్మకంతోనే మెటఫండ్ అనే కంపెనీలో బాధితుల నుంచి పెట్టుబడి పెట్టించాడని ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరితో  రూ.7లక్షల వరకు పెట్టుబడులు పెట్టించాడని.. మరి కొందరితో రూ.70 లక్షల దాకా పెట్టుబడులు పెట్టించాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులంతా రాకేష్ ను నిలదీశారు.

Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
 
అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ గత 8 నెలలుగా తమను రాకేష్ వెంట తిప్పించుకుంటున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరకు రాకేష్ ఇంటి అడ్రస్ కనుక్కుని బాధితులు అక్కడకు వెళ్లారు. రాకేష్ సమయానికి ఇంట్లో లేకపోవడంతో వారంతా ఆందోళన చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాధితులను కంప్లయింట్ ఇవ్వాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ వెంటనే వచ్చి బాధితులతో మాట్లాడాడు. కొంత టైమ్ ఇస్తే డబ్బులు మొత్తం తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో వారంతా ఫిర్యాదు చేయకుండానే బయలు దేరారు. డబ్బులు అడిగినప్పుడల్లా రాకేష్ ఇలాగే దాటవేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!

అయితే రాకేష్‌ మెటఫండ్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో బిజినెస్‌ నిర్వహిస్తోంది. పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలిస్తామని ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టించుకున్నట్లు తెలిసింది. బాధితులు ఎవరూ కూడా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Also Read: మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్.. ట్రైన్‌ హైజాక్‌కు భారత్‌ సాయం చేసిందని ఆరోపణలు

Also Read: అమ్మకానికి కన్యత్వం.. నెట్టింట 22ఏళ్ల విద్యార్థిని రచ్చ.. కోట్లు గుమ్మరించిన హాలీవుడ్ హీరో!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు